Jeevan Reddy: ఓడిపోతానన్న భయం కేసీఆర్‌ను వెంటాడుతున్నట్టుంది: జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం తన సొంత జాగీరులా భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓటమి భయం వెంటాడుతున్నట్లుందని, అందుకే ఆయన నోట ఫాంహౌస్‌ మాటలు వస్తున్నాయని జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి, పార్టీ సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జగిత్యాలలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు.

తనను గెలిపిస్తే పాలిస్తానని, లేదంటే ఫాంహౌస్‌కు పరిమితమవుతానని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అధికారంకోసం కేసీఆర్‌ కుటుంబం తాపత్రయం ఏ స్థాయిలో ఉందో ఈ మాటలు వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కొడుకు కేటీఆర్‌ రాజకీయ సన్యాసం తీసుకుంటాననడం, కేసీఆర్‌ ఫాం హౌస్‌కు వెళ్లిపోతానని చెప్పడం చూస్తుంటే ఓడిపోతే కనీసం విపక్షంలో కూర్చునే ధైర్యం కూడా వారికి లేదనిపిస్తోందని విమర్శించారు.
Go Back to Shorts
Jeevan Reddy
jagityala
KCR

More Telugu News