psyco thief: 600 దొంగతనాలు, 7 మిస్టరీ మర్డర్లు.. సైకో దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
వరుస దొంగతనాలు, హత్యలతో పోలీసులను హడలెత్తిస్తున్న సైకో కిల్లర్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే అతను చెప్పిన విషయాలను విన్న పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. తాను 600 దొంగతనాలు చేసినట్లు అంగీకరించిన నిందితుడు.. ఈ క్రమంలో ఏడుగురిని కిరాతకంగా హత్యచేశానని ఒప్పుకున్నాడు.

ఫరీదాబాద్ కు చెందిన జగ్తార్ సిన్హా బతుకుదెరువు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఏకంగా 600 దొంగతనాలు చేశాడు. అయితే ఈ సందర్భంగా అడ్డువచ్చేవారిని తొలగించుకునే క్రమంలో ఏడుగురిని కిరాతకంగా హతమార్చాడు. ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో నిందితుడు మీడియాతో మాట్లాడుతూ.. తాను హత్యలు చేసేముందు 108 సార్లు కాళిమాత మంత్రాలతో జపం చేస్తానని తెలిపాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తంగానే ఈ జపం చేస్తానన్నాడు.

ఈ సందర్భంగా ఫరీదాబాద్ పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు జగ్తార్ సిన్హాపై పంజాబ్, ఢిల్లీ, హరియాణా, ఫరీదాబాద్, ప్రాంతాల్లో 500 నుంచి 600 దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నామన్నారు. ప్రస్తుతం నిందితుడిని కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.
Go Back to Shorts
psyco thief
Police
arrest
600 thefts
7 murders

More Telugu News