pooja bedi: వెండితెరపైకి మరో నట వారసురాలు

షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు వెండితెరపై తమ హవాను కొనసాగించినవాళ్లు, తమ పిల్లలను కూడా అదే బాటలో నడిపించడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ల వారసులు కూడా అదే మార్గంలో తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆసక్తిని చూపుతున్నారు. అలా నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, తన అదృష్టాన్ని పరీక్షించుకునేవారి జాబితాలో పూజా బేడీ కూతురు 'ఆలియా ఫర్నిటర్వాలా' ఒకరుగా కనిపిస్తోంది.

ఒకప్పుడు బాలీవుడ్ క్వీన్ అనిపించుకున్న పూజా బేడీ, తన కూతురును 'జవానీ జానెమన్' సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయం చేయనుంది. ఇది తండ్రీ కూతుళ్ల అనుబంధానికి సంబంధించిన కథ. ఈ సినిమాలో ఫర్ని టర్వాలాకి తండ్రి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆలియా ఫర్ని టర్వాలా కెరియర్ గ్రాఫ్ ను ఈ సినిమా ఏ వైపుకు తీసుకెళుతుందో చూడాలి.     
Go Back to Shorts
pooja bedi
aalia

More Telugu News