Mahesh Babu: భారీ విలేజ్ సెట్లోకి అడుగుపెడుతోన్న మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
విభిన్నమైన కథాకథనాలతో 'మహర్షి' సినిమా నిర్మితమవుతోంది. దిల్ రాజు - అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా యూఎస్ షెడ్యూల్ ను పూర్తిచేసిన ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో జరుపుకోనుంది.

ఇక్కడి స్టూడియోలో వేసిన భారీ విలేజ్ సెట్లో రేపటి నుంచి షూటింగ్ మొదలుకానుంది. మహేశ్ బాబు .. అల్లరి నరేశ్ .. పూజా హెగ్డే తదితరులపై గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. డిసెంబర్లో జరిగే పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తికానుంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ కీలకమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, ఏఫ్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.      
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News