టీజేఎస్ కు 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం?.. ఇందులో కూడా మెలిక పెట్టిన కాంగ్రెస్!
Add ap7am to your home Screen

టీజేఎస్ కు 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం?.. ఇందులో కూడా మెలిక పెట్టిన కాంగ్రెస్!

  • పలు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని చెప్పిన కాంగ్రెస్
  • తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన టీజేఎస్
  • 4 జిల్లాల్లో సీట్లను కేటాయించకపోవడంపై కూడా అసహనం
మహాకూటమిలో భాగంగా టీజేఎస్ కు 11 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కూడా టీజేఎస్ కు షాక్ ఇచ్చేలా ఒక మెలిక పెట్టింది. పలు స్థానాల్లో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపింది. అంటే... టీజేఎస్ పోటీ చేసే స్థానాల్లో కూడా కాంగ్రెస్ తన అభ్యర్థులను బరిలోకి దించుతుందన్నమాట. ఈ అంశంపై టీజేఎస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.

మరోవైపు తమకు కేటాయించిన స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే సీట్లపై ఆ పార్టీ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనికి తోడు ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తమకు సీట్లను కేటాయించకపోవడంపై కూడా ఆ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.
congress
tjs
mahakutami
seats

More Telugu News