తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెడితే.. అదే టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్ నేతల కాళ్లదగ్గర పెట్టారు!: లక్ష్మీపార్వతి
- టీడీపీని బాబు పతనావస్థకు తీసుకెళ్లారు
- అవినీతి కేసుల నుంచి రక్షణకే కాంగ్రెస్ తో చెలిమి
- టీడీపీ-కాంగ్రెస్ పొత్తుకు నిరసనగా ధర్నా
తన భర్త స్థాపించిన పార్టీని చంద్రబాబు ఈ స్థాయికి దిగజార్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన చర్యలతో టీడీపీని పతనావస్థకు తీసుకెళ్లారని విమర్శించారు. నిజంగా ఎన్టీఆర్ ఇచ్చిన ఆత్మగౌరవ నినాదం కాపాడటం కోసమే కోసం కాంగ్రెస్ తో చేతులు కలిపారా? లేక అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి చేరారా? అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తానని లక్ష్మీపార్వతి ప్రకటించారు. బాబు చర్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని వ్యాఖ్యానించారు.