'సవ్యసాచి'లో .. 'సుభద్ర పరిణయం'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సవ్యసాచి'లో .. 'సుభద్ర పరిణయం'

  • రేపే ప్రేక్షకుల ముందుకు
  • కామెడీ ప్రధానంగా వదిలిన ట్రైలర్ 
  • చైతూ జోడీగా నిధి అగర్వాల్  
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన 'సవ్యసాచి' చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక కామెడీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కాలేజ్ లో చైతూ .. ఆయన ఫ్రెండ్స్ కలిసి 'సుభద్ర పరిణయం' నాటకం వేస్తారు. ఆ నాటకంపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ నాటకంలో కృష్ణుడిగా వెన్నెల కిషోర్ .. అర్జునుడిగా చైతూ .. బలరాముడిగా హైపర్ ఆది కనిపిస్తున్నారు.

'మూడు పరీక్షలు గెలిస్తే సుభద్రను చేసుకోవచ్చు .. ఓడిపోతే చెలికత్తెను చేసుకోవచ్చు' అని హైపర్ ఆది తనదైన స్టైల్లో పంచ్ వేశాడు. ఇలా పౌరాణిక పాత్రల్లో .. వేషధారణలో హాస్యాన్ని పండించడానికి ప్రయత్నించారు. ఇప్పటివరకూ ఈ సినిమాలోని లవ్ .. యాక్షన్ ను మాత్రమే చూపించిన టీమ్, కామెడీ కూడా కావలసినంత ఉందని చెప్పే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్ ద్వారా చేశారు. ఈ సినిమాలో చైతూ జోడీగా నిధి అగర్వాల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
nagachaitanya
nidhi agarwal

More Telugu News