KCR: కేసీఆర్‌ది తెలంగాణ కులం.. టీఆర్ఎస్‌కు పేపర్, చానల్ లేవు: వినోద్

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుది తెలంగాణ కులం అని, అన్ని కులాలను ఆయన ఒకేలా చూస్తారని ఆ పార్టీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. టీఆర్ఎస్‌కు ప్రత్యేకంగా పేపర్ కానీ, చానల్ కానీ లేవని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌ తనకున్న పేపర్, చానల్‌ను దుర్వినియోగం చేస్తోందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనీ విధంగా స్పందించారు. బుధవారం సీఈవో రజత్ కుమార్‌కు వివరణ ఇస్తూ ఆ వార్తా సంస్థలతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు.

కేసీఆర్‌కు కులాన్ని ఆపాదించడం దారుణమని వినోద్ పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ విస్తృత పర్యటనలు చేయాల్సి ఉండడంతోనే హెలికాప్టర్ వినియోగానికి అనుమతులు కోరినట్టు చెప్పారు. ఈ వివరాలను రజత్ కుమార్ అడిగారని, వాటిని అందించేందుకే సీఈవోను కలిసినట్టు చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లిన వెంటనే కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లడంపై వస్తున్న విమర్శలకు వినోద్ స్పందించారు. కేసీఆర్ కంటి పరీక్షల కోసమే ఢిల్లీ వెళ్లారని, రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. కంటి పరీక్షల కోసం కేసీఆర్ గతంలోనూ ఢిల్లీకి వెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Go Back to Shorts
KCR
Telangana
TRS
Vinod
EC
Rajat kumar

More Telugu News