జగన్ పై దాడి వ్యవహారం.. టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై పోలీసులకు వైసీపీ ఫిర్యాదు!
- కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు పీఎస్ లో ఫిర్యాదు
- అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత
- గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, నేతలు
జగన్ ను అడ్డు తొలగించుకోవాలని భావించి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలే ఈ దాడి చేయించారని టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్ పై జరిగిన దాడి ఘటనపై చాలా అనుమానాలు కలుగుతున్నాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజేంద్రప్రసాద్ ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని జూపూడి వ్యాఖ్యానించారు.