సనత్ జయసూర్యపై ఐసీసీ సంచలన నిర్ణయం

  • రెండు అభియోగాల నమోదు
  • వివరణ ఇచ్చుకునేందుకు రెండు వారాల గడువు
  • ఆర్టికల్ 2.4.6, 2.4.7 కోడ్ కింద నేరాలు
ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను రెండు సార్లు ఉల్లంఘించడంతో ప్రముఖ క్రికెటర్, శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యపై రెండు అభియోగాలు నమోదు చేసింది. ఈ అభియోగాలపై అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు జరపనుంది. ఈ అభియోగాలపై వివరణ ఇచ్చుకునేందుకు జయసూర్యకు ఐసీసీ రెండు వారాల గడువిచ్చింది. ఆర్టికల్ 2.4.6, 2.4.7 కోడ్ కింద ఆయన రెండు నేరాలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Sanath Jayasurya
Icc
Srilanka Ex Captain

More Telugu News