Trains: ఇక విమానాల్లో మాదిరిగా రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు!

షార్ట్స్‌లో చూడండి
ఇకపై రైలు ప్రమాదాల కారణాల గురించి కచ్చితమైన సమాచారం లభించనుంది. ఇందుకోసం భారతీయ రైళ్లు త్వరలో మరింత అధునాతన సాంకేతికతను సంతరించుకోనున్నాయి. విమానాల్లో మాదిరిగా రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు ఏర్పాటు చేయాలనే యోచన చేస్తున్నట్టు సమాచారం.

ఈ మేరకు రైళ్లలో లోకో క్యాబ్ వాయిస్ రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం సంభవించినపుడు బ్లాక్ బాక్సుల ద్వారా సిబ్బంది పనితీరును, ప్రమాదానికి గల కారణాలపై ఓ నిర్ణయానికి రావడానికి ఆస్కారం లభిస్తుంది. అయితే ఇంకా ఇది అభివృద్ధి దశలోనే ఉన్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. 
Go Back to Shorts
Trains
Flights
Black Box
Voice Recording
Indian Railway

More Telugu News