బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Bandi Bhagirath bail petition verdict reserved
  • బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
  • భగీరథ్‌కు బెయిల్ ఇవ్వొద్దని బాధితురాలి తరపు న్యాయవాది వాదన
  • సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వివరణ
  • బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా అభియోగాలను సవరించినట్లు పోలీసుల వెల్లడి
  • నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్ వాదన
పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టును కోరారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. ఇంకా పలువురు సాక్షులను విచారించాల్సి ఉందని తెలిపారు. ఈ దశలో బెయిల్ మంజూరైతే వారిపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. భగీరథ్ జైలులో ఉంటేనే దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని పేర్కొన్నారు.

మరోవైపు పేట్‌బషీరాబాద్ పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత ఆరోపణల తీవ్రత దృష్ట్యా అభియోగాలను సవరించినట్లు కోర్టుకు వెల్లడించారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు.
Bandi Bhagirath
POCSO Case
Telangana High Court
Bail Petition
Petbashirbad Police
Sexual Assault Case

More Telugu News