'మావిగన్' గురించి జగన్ మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి: విష్ణుకుమార్ రాజు
- అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించిందన్న విష్ణుకుమార్ రాజు
- జగన్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని విమర్శ
- సర్ పేరుతో ఓట్లు తొలగించడం లేదన్న బీజేపీ ఎమ్మెల్యే
అమరావతే రాజధాని అని అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత కూడా జగన్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుండటం చూడలేక జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు అన్నారు. మావిగన్ గురించి మాట్లాడాలనుకుంటే... అసెంబ్లీలో చర్చించాలని, బయట ప్రెస్ మీట్లు పెట్టడం సరికాదని సూచించారు. రుషికొండ భవనాలను ప్రజలందరికీ ఉపయోగపడేలా వినియోగించాలని చెప్పారు. 'సర్' పేరుతో ఎవరి ఓట్లు తొలగించడం లేదని అన్నారు.