హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణం.. రంగంలోకి ఉన్నతాధికారులు
- ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుపై అధికారుల దృష్టి
- అనుమతులు లేవని స్పష్టం చేసిన ఇరిగేషన్ శాఖ
- నిర్మాణ స్థలాన్ని సంయుక్తంగా తనిఖీ చేసిన ఉన్నతాధికారులు
- విచారణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని వెల్లడి
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల నేతృత్వంలోని బృందం నిర్మాణ స్థలాన్ని సంయుక్తంగా తనిఖీ చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని నీటిపారుదల శాఖ స్పష్టం చేయడంతో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తిస్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో చేపట్టే నిర్మాణాలపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ నగరానికి చారిత్రక, పర్యావరణ వారసత్వంగా ఉన్న హుస్సేన్ సాగర్‌ను సంరక్షించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.