‘మీ టూ’కు బ్రేక్.. జర్నలిస్ట్ ప్రియా రమణిపై కేంద్ర మంత్రి అక్బర్ పరువునష్టం దావా!
- అక్బర్ తనను వేధించాడని చెప్పిన ప్రియ
- ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో దాఖలు
- ఆరోపణలన్నీ రాజకీయ కుట్రేనన్న అక్బర్
ఎంజే అక్బర్ న్యాయవాది కరంజవాలా పటియాలా హౌస్ కోర్టులో ఈ రోజు మంత్రి తరఫున పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఓ సీనియర్ జర్నలిస్ట్ తనను లైంగికంగా వేధించాడన్న ప్రియా రమణి, సదరు వ్యక్తి ఎంజే అక్బర్ అని బయటపెట్టి సంచలనం సృష్టించారు. దీంతో మరో 10 మంది మహిళా జర్నలిస్టులు తాము కూడా అక్బర్ చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో అక్బర్ తనపై వచ్చిన అభియోగాలను ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారనీ, తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు ప్రియా రమణిపై పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.