Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న 'మీటూ' ఉద్యమానికి పలువురి నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా కథానాయిక పూజా హెగ్డే కూడా దీనికి మద్దతు పలికింది. వేధింపుల నివారణ విషయంలో చిత్ర పరిశ్రమ గట్టి నిర్ణయం తీసుకుని, ఇది మహిళలకు సురక్షితమైన రంగమని తెలియజెప్పవలసిన సమయం ఆసన్నమైందని పూజా పేర్కొంది. ఈ విషయంలో పురుషులు కూడా మహిళలకు మద్దతు పలకాలని కోరింది.
*  నాని సరసన కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించనుంది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న 'జెర్సీ' చిత్రంలో నాయికగా శ్రద్ధాను తీసుకున్నారు.
*  సుమంత్ హీరోగా అనిల్ శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇదం జగత్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మలయాళ నటి అంజూ కురియన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేస్తారు.
*  ఇటీవల 'గీత గోవిందం' చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు పరశురాం త్వరలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోంది.
Go Back to Shorts
Pooja
Nani
sumanth

More Telugu News