రాఫెల్ డీల్‌లో రిలయన్స్‌ను తప్పనిసరి భాగస్వామిగా చేర్చుకోవాలన్న మోదీ ప్రభుత్వం.. కీలక ఆధారాలను బయటపెట్టిన ఫ్రాన్స్ మీడియా!
- రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవాల్సిందేనని నిబంధన
- ఆధారాలు బయటపెట్టిన ఫ్రాన్స్ మీడియా
- కాంగ్రెస్‌కు కొత్త అస్త్రం
రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రతిపాదించింది భారత ప్రభుత్వమేనంటూ ఇటీవల ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు బాంబు పేల్చారు. అయితే, రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలన్నది తమ సొంత నిర్ణయమేనంటూ డసో ఏవియేషన్ తేల్చి చెప్పింది. ఇప్పుడు రిలయన్స్ డిఫెన్స్‌ను తప్పనిసరిగా భాగస్వామిగా చేర్చుకోవాలంటూ ప్రభుత్వం పెట్టిన నిబంధనకు సంబంధించిన ఆధారాలు బయపటడడంతో మరోమారు కలకలం రేగింది. రాఫెల్ డీల్‌పై ఇప్పటికే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి మరో అస్త్రం చిక్కింది.