అనుష్క చాలా మంచిది: ప్రభాస్ శ్రీను
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క చాలా మంచిది: ప్రభాస్ శ్రీను

  • అనుష్క స్టార్ డమ్ చూపించరు
  • అందరితోనూ కలుపుగోలుగా వుంటారు
  • ఎవరినీ నొప్పించకపోవడం ఆమె ప్రత్యేకత
తెలుగు తెరపై కామెడీని .. కామెడీ టచ్ తో కూడిన రౌడీయిజాన్ని పండించడంలో ప్రభాస్ శ్రీను తన ప్రత్యేకతను కనబరుస్తూ ఉంటాడు. అలాంటి ప్రభాస్ శ్రీను తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుష్క గురించి ప్రస్తావించాడు. "అనుష్క ఎంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె ఆ స్థాయిని చూపించరు. తనకంటే తక్కువ స్థాయివారితో కూడా ఆమె ఎంతో చనువుగా వుంటారు. ఎవరినీ నొప్పించకపోవడం ఆమె ప్రత్యేకత.'భాగమతి' సినిమా షూటింగ్ ఒక హాస్టల్ బిల్డింగ్ లో రాత్రివేళ జరగనుంది. దసరా సెలవుల కారణంగా తెల్లవారితే ఆ హాస్టల్ లోని పిల్లలంతా ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లనున్నారు. వాళ్లందరికీ కావలసిన బట్టలు .. చాక్లెట్ లు .. బిస్కట్లు .. సబ్బులు .. పేస్టులు తెప్పించి అనుష్క పంచిపెట్టారు. పిల్లలంతా కూడా ఎంతగానో ఆనందించారు. ఆమె మంచితనం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అందుకే మంచితనం అనే మాట వినిపిస్తే నాకు అనుష్క గుర్తుకు వస్తుంది" అని చెప్పుకొచ్చాడు. 
anushka

More Telugu News