Mahesh Babu: 'మహర్షి' రీషూట్ అంటూ ఫిల్మ్ నగర్ టాక్

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు తాజా చిత్రంగా 'మహర్షి' రూపొందుతోంది. మహేశ్ బాబుకి ఇది 25వ సినిమా కావడం వలన ఇది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అందువలన మహేశ్ అభిమానుల అంచనాలను అందుకునేలా వంశీ పైడిపల్లి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది.

ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ ను రీసెంట్ గా దర్శక నిర్మాతలు .. మహేశ్ బాబు కలిసి చూశారట. కీలకమైన కొన్ని సన్నివేశాలు తాను ఆశించినట్టుగా రాలేదంటూ మహేశ్ బాబు అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. దాంతో దర్శకనిర్మాతలు అందుకు అంగీకరించినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News