ప్రముఖ కన్నడ నటుడు రాజ్ కుమార్ కిడ్నాప్ కేసు.. తొమ్మిది మందీ నిర్దోషులేనంటూ తీర్పు!
- పద్దెనిమిదేళ్ల క్రితం నాటి కేసు తీర్పు
- నిందితులు వీరప్పన్ మనుషులనేందుకు సాక్ష్యాల్లేవు
- వారిని నిర్దోషులుగా ప్రకటించిన తమిళనాడు న్యాయస్థానం
కాగా, 2000 సంవత్సరం జులై 30న తన ఫామ్ హౌస్ లో రాజ్ కుమార్ ను కొందరు దుండగులు ఆయుధాలతో బెదిరించి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు. 108 రోజుల తర్వాత కిడ్నాపర్లు ఆయన్ని వదిలిపెట్టారు. ఈ కిడ్నాప్ నేపథ్యంలో వీరప్పన్, మరో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరప్పన్ ను హతమార్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు పలు కారణాల వల్ల మృతి చెందారు.