Mahesh Babu: యూఎస్ కి బయల్దేరనున్న 'మహర్షి' టీమ్

షార్ట్స్‌లో చూడండి
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'మహర్షి' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ ను యూఎస్ లో ప్లాన్ చేశారు. ఈ నెల చివరి నుంచి ఈ షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ షెడ్యూల్ వాయిదా పడింది. అక్టోబర్ 2వ వారం నుంచి ఈ షెడ్యూల్ షూటింగును అక్కడ ఆరంభించనున్నారు. 25 రోజుల పాటు అక్కడ జరగనున్న షూటింగులో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు, రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. మహేశ్ కి ఇది 25వ సినిమా కావడంతో, అభిమానులంతా ఎంతో ఆసక్తితో వున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News