చైతూ విషయంలో తెగ ఫీలైపోయిన సమంత... ఫర్వాలేదని చెప్పిన నాగార్జున!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైతూ విషయంలో తెగ ఫీలైపోయిన సమంత... ఫర్వాలేదని చెప్పిన నాగార్జున!

  • ఒకే రోజు విడుదలైన సమంత, చైతూల చిత్రాలు
  • చైతూ చిత్రానికి మిక్సెడ్ రియాక్షన్, సమంత చిత్రానికి రాలని డబ్బులు
  • పరిస్థితి మారుతుందని సర్దిచెప్పిన నాగార్జున
ఇటీవల టాలీవుడ్ సెలబ్రిటీ జంట నాగ చైతన్య, సమంతలు విడివిడిగా నటించిన సినిమాలు 'శైలజారెడ్డి అల్లుడు', 'యూటర్న్' ఒకేరోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాల విడుదల తరువాత, చైతూ గురించి ఆలోచించిన సమంత ఫీలైపోయిందట. తన భర్త నటించిన చిత్రానికి వచ్చిన రివ్యూలు చూసి నిరాశతో తన బాధను మామ నాగార్జునకు చెప్పుకుందట. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించాడు. తన తండ్రి నాగేశ్వరరావు జన్మించిన సెప్టెంబర్ నెలంటే తనకెంతో ప్రత్యేకమని చెప్పిన ఆయన, ప్రపంచంలో భార్యాభర్తల సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయా? అని ప్రశ్నిస్తూ, ఆ ఘనత కూడా అక్కినేని ఫ్యామిలీదేనని అన్నారు.

'శైలజారెడ్డి అల్లుడు', 'యూటర్న్' రెండూ విడుదలైన రోజు సమంత బాధపడిందని అన్నారు.  'శైలజారెడ్డి అల్లుడు' రివ్యూలు చూసి, తన వద్దకు వచ్చి, బాధను వ్యక్తపరిస్తే, ఫర్వాలేదని, సాయంత్రానికి అంతా మారిపోతుందని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఆపై "మామా నా సినిమాకు రివ్యూలు బాగున్నా, బాక్సాఫీస్ గంట మోగలేదు" అని చెప్పగా, ఆదివారానికి పరిస్థితి మారిపోతుందని సర్దిచెప్పానని, చివరకు అలాగే జరిగిందని అన్నారు.
Samanta
Nagachaitanya
Nagarjuna

More Telugu News