ప్రధాని మోదీ దేశ ద్రోహానికి పాల్పడ్డారు.. సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారు: రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
- వేల కోట్ల రాఫెల్ డీల్ ను అనిల్ అంబానీకి మోదీనే స్వయంగా అప్పగించారు
- నిజాలను బయటపెట్టినందుకు ఫ్రాంకోయిస్ కు ధన్యవాదాలు
- దేశాన్ని మోదీ మోసం చేశారు
తనకు తానే స్వయంగా వేల కోట్ల విలువైన డీల్ ను అనిల్ అంబానీకి మోదీ అప్పగించారని రాహుల్ విమర్శించారు. రాఫెల్ ఒప్పందం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టినందుకు ఫ్రాంకోయిస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఫ్రాంకోయిస్ వ్యాఖ్యలతో అనిల్ అంబానీకి మోదీనే స్వయంగా డీల్ ను అప్పగించారనే విషయం స్పష్టమయిందని చెప్పారు. దేశ ద్రోహానికి పాల్పడ్డ మోదీ... దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల రక్తాన్ని అగౌరవపరిచారని విమర్శించారు.