ప్రకోపించిన కామం... నడివీధిలో అమ్మాయిలను అసభ్యంగా తాకే హోమ్ గార్డు... వీడియో వైరల్!
- నడిరోడ్డుపై బాలికలను అసభ్యంగా తాకిన హోమ్ గార్డు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- కొచ్చిలో ఘటన... సీరియస్ అయిన పోలీస్ కమిషనర్
ఎలమక్కరాకు చెందిన శివకుమార్ వయసు 58 సంవత్సరాలు కాగా, తన మనవరాళ్ల వయసులో ఉండి, పాఠశాలలకు వెళుతున్న విద్యార్థినులను కూడా వదల్లేదు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో, సీటి పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు.