తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి హత్యకు కుట్ర.. డ్రోన్లతో నిఘా పెట్టిన దుండగులు!
- ఈ నెల 2న నాగారంలో డ్రోన్లతో సర్వే
- గతంలో మంత్రిపై జరిగిన హత్యాయత్నం
- గ్రామస్తులతో కలిసి ఉండగా చంపాలని ప్లాన్
స్వగ్రామానికి మంత్రి వచ్చినప్పుడు హత్యచేసి పరారవ్వాలని దుండగులు ప్లాన్ చేసినట్లు సమాచారం. దాదాపు ఏడాది క్రితం జగదీశ్ రెడ్డి సూర్యాపేటకు వస్తుండగా ఆయన కాన్వాయ్ లోని కారును ఓ వ్యాన్ బలంగా ఢీకొట్టింది. అనంతరం ఆ వ్యాన్ తో సహా డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో జగదీశ్ రెడ్డి మరో కారులో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రిని చంపేందుకు మరోసారి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
నాగారంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తమకు సమాచారం అందిందని మీడియాకు ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.