Tamilnadu: పెళ్లికి తొందర పెడుతున్నాడట... ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటి!

షార్ట్స్‌లో చూడండి
తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు బలవంతం చేస్తున్నాడని తమిళ నటి నీలాణి పోలీసులను ఆశ్రయించింది. తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన వేళ, పోలీసుల దుస్తుల్లో వెళ్లి, సోషల్ మీడియాకు ఎక్కిన ఈ భామను, అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై బెయిల్ మీద బయటకు వచ్చిన నీలాణి, గాంధీ లలిత్ కుమార్ అనే యువకుడితో ప్రేమాయణం సాగించినట్టు, ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్టు వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓ టీవీ సీరియల్ లో నటిస్తున్న ఆమె, మైలాపూర్ లో షూటింగ్ లో పాల్గొంటుండగా, లలిత్ అక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవాలంటూ గొడవకు దిగాడట. దీంతో షూటింగ్ లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. లలిత్ కుమార్ తో తాను స్నేహంగా మాత్రమే మెలగుతున్నానని, పెళ్లి చేసుకోవాలని అడగడం తనకు ఇష్టం లేదని చెప్పింది. అతనిపై చర్యలు తీసుకోవాలని నీలాణి కోరగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Go Back to Shorts
Tamilnadu
Actress
Nilani
Police
Lover
Marriage

More Telugu News