'పేపర్ బాయ్' రైట్స్ తీసుకోవడానికి కారకుడు బన్నీ: అల్లు అరవింద్
- సంతోష్ శోభన్ హీరోగా 'పేపర్ బాయ్'
- నిర్మాతగా సంపత్ నంది
- వచ్చేనెల 7వ తేదీన రిలీజ్
తాజాగా ఈ విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, " నేను ఈ సినిమా రైట్స్ తీసుకోవడానికి కారకుడు బన్నీ. ఒక రోజున బన్నీ నాకు ఈ సినిమా ట్రైలర్ వీడియోను పంపించాడు. ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది .. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అనిపించింది. అదే సమయంలో సంపత్ నంది వచ్చి ఈ సినిమాను ఒకసారి చూడమని అడిగాడు. ట్రైలర్ నచ్చడం వల్లనే సినిమా చూశాను .. చూశాక ఈ సినిమాకి మంచి పబ్లిసిటీతో కూడిన రిలీజ్ అవసరమని అనిపించింది. అందువలన ఈ సినిమా రైట్స్ ను కొనడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.