హరికృష్ణ మృతదేహం వెంట బాలయ్య, త్రివిక్రమ్
- హైదరాబాద్ కు బయలుదేరిన అంబులెన్స్
- వెంట భారీ కాన్వాయ్ లో పలువురు ప్రముఖులు
- ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల వాహనాలు కూడా ఈ కాన్వాయ్ లో ఉన్నాయి. దీంతో మెహిదీపట్నంలోని హరికృష్ణ ఇంటి వరకూ ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, నాంపల్లి, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో కాన్వాయ్ ప్రయాణం సజావుగా సాగేందుకు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు.