ఎన్టీఆర్ తరువాత హరికృష్ణకు మాత్రమే తెలిసిన విషయమిది: నిమ్మకూరు వాసులు
- తీవ్ర ఆవేదనలో నిమ్మకూరు వాసులు
- గ్రామంలో ఎవరి ఇల్లు ఎక్కడుందో సర్వమూ తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్
- ఆ తరువాత ఆ వివరాలు తెలిసింది హరికృష్ణకు మాత్రమే
- విలపిస్తూ గుర్తు చేసుకుంటున్న గ్రామస్తులు
నిమ్మకూరు అభివృద్ధిని గురించి అనునిత్యమూ తపనపడే ఆయన, ఎంపీగా ఉన్న వేళ, గ్రామంలో రోడ్లు, నీటి వసతి పనులకు నిధులు కేటాయించారని గుర్తు చేసుకున్నారు. గ్రామంలో ఎవరెవరు ఉంటున్నారు? ఎవరి ఇల్లు ఎక్కడుంది? ఎవరెవరు బంధువులు? తదితర విషయాలన్నీ ఎన్టీఆర్ కు బాగా తెలుసునని, ఆ తరువాత ఆ వివరాలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి హరికృష్ణేనని, ఆయన మరణించారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని విషణ్ణ వదనంతో వ్యాఖ్యానించారు. కాగా, నిమ్మకూరులోని ఎన్టీఆర్ బంధుగణమంతా, హరికృష్ణ మరణవార్తను తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.