'పేపర్ బాయ్'పట్ల మహేశ్ .. ప్రభాస్ ఆసక్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పేపర్ బాయ్'పట్ల మహేశ్ .. ప్రభాస్ ఆసక్తి

  • కొత్త కోణంలో 'పేపర్ బాయ్' ప్రేమకథ
  • నిర్మాతగా మారిన సంపత్ నంది 
  • ఈ నెల 31వ తేదీన విడుదల  
యూత్ ను ఆకట్టుకునే ప్రేమకథాంశంతో ఈ నెల 31వ తేదీన 'పేపర్ బాయ్' ప్రేక్షకుల ముందుకు రానుంది. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ .. రియా సుమన్ నాయకా నాయికలుగా నటించారు. సంపత్ నంది నిర్మాతగా మారి ఒక చిన్న సినిమాగానే దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే 'పేపర్ బాయ్ 'పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తూ .. అభిమానుల దృష్టిని ఈ సినిమా వైపు తిప్పడానికి మహేశ్ .. ప్రభాస్ ఉత్సాహాన్ని చూపిస్తూ వస్తున్నారు. ఈ సినిమా హీరో సంతోష్ శోభన్ ఎవరో కాదు .. గతంలో మహేశ్ తో 'బాబీ' .. ప్రభాస్ తో 'వర్షం' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శోభన్ తనయుడు. 'బాబీ' మహేశ్ లోని నటుడిని కొత్తకోణంలో చూపించింది. 'వర్షం' ప్రభాస్ కెరియర్లో తొలి సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ కారణంగానే సంతోష్ శోభన్ సినిమాకి  మహేశ్ .. ప్రభాస్ లు తమ వైపు నుంచి సపోర్ట్ ను అందజేస్తూ వస్తున్నారు. 
santhosh sobhan
riya suman

More Telugu News