వారం ముందుగానే 'పేపర్ బాయ్' వచ్చే ఛాన్స్
- సంపత్ నంది నిర్మాతగా 'పేపర్ బాయ్'
- టీజర్ .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్
- విడుదల తేదీ మారే ఛాన్స్
వచ్చేనెల 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ నెల 31వ తేదీన విడుదల కావలసిన 'శైలజా రెడ్డి అల్లుడు' వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడితే, 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'పేపర్ బాయ్' రెడీ అవుతున్నట్టుగా సమాచారం. సెప్టెంబర్ 7వ తేదీన విడుదలయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా, 'పేపర్ బాయ్' ముందుకు రావాలనుకోవడానికి మరో కారణమని చెబుతున్నారు.