మాటలతోనే ఆకట్టుకుంటోన్న 'పేపర్ బాయ్' ట్రైలర్!
- మరో ప్రేమకథాంశంగా 'పేపర్ బాయ్'
- నిర్మాతగా సంపత్ నంది
- వచ్చేనెల 7వ తేదీన విడుదల
హీరో హీరోయిన్ల కాంబినేషన్లోని సన్నివేశాలపైనే ట్రైలర్ ను కట్ చేశారు. "నాకు పరిచయమైంది పుస్తకాలు .. దగ్గరైంది అక్షరాలు" .." ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది .. అది కనిపించదు .. కానీ బతికేస్తుంది".. "ముద్దుపెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు .. ఊపిరి మార్చుకోవడం" అనే డైలాగ్స్ యూత్ మనసులను ఆకట్టుకునేలా వున్నాయి. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. వచ్చేనెల 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.