జలదృశ్యం అద్భుతం... ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లూ ఎత్తివేత!
- ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు
- నిండుకుండలా మారిన జలాశయం
- 70 గేట్ల ఎత్తివేతతో సుందర దృశ్యం
దీంతో కృష్ణమ్మ పరవళ్లు విద్యుద్దీప కాంతుల మధ్య అద్భుత జలదృశ్యాన్ని సాక్షాత్కరింపజేస్తుండగా, దాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. కృష్ణా నదీ తీరం ఒక్కసారిగా నీటితో నిండిపోగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అవసరమైతే ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.