'మారి 2' పూర్తి .. హిట్ ఖాయమంటోన్న ధనుష్

  • గతంలో హిట్ కొట్టిన 'మారి'
  • సీక్వెల్ షూటింగ్ పూర్తి 
  • త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన  
తమిళంలో కథాకథనాలకి .. వైవిధ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే కథానాయకుల జాబితాలో ధనుష్ ముందు వరుసలో కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో 'మారి 2' రూపొందుతోంది. గతంలో ధనుష్ చేసిన 'మారి' సినిమాకి ఇది సీక్వెల్. 2015లో వచ్చిన 'మారి' ధనుష్ క్రేజ్ ను పెంచింది. దాంతో ఆయన తన సొంత బ్యానర్లో సీక్వెల్ ను నిర్మిస్తున్నాడు.

ఈ రోజుతో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. 'మారి'లో కథానాయికగా కాజల్ నటించగా, 'మారి 2'లో సాయిపల్లవి నటించింది. ఈ సినిమాలో ఆమె ఆటో డ్రైవర్ గా కనిపించనుండటం విశేషం. వరలక్ష్మీ శరత్ కుమార్ నెగెటివ్ రోల్ చేయడం మరో ప్రత్యేకత. ధనుష్ డిఫరెంట్ లుక్ తో కనిపించనుండటం ఆయన అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచే అంశం. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో ధనుష్ వున్నాడట.    
Go Back to Shorts
dhanush
sai pallavi

More Telugu News