నిమ్మకూరులో ప్రత్యేక పూజలు చేసి రంగంలోకి దిగిన క్రిష్, బాలకృష్ణ!
- ఈ ఉదయం నిమ్మకూరులో బాలయ్య, క్రిష్
- 'ఎన్టీఆర్' చిత్ర బృందం మొత్తం నిమ్మకూరులోనే
- సినిమాలోని కొన్ని సీన్స్ తీయనున్న క్రిష్
ఎన్టీఆర్ చిన్నప్పటి ఇల్లు, ఆయన తిరిగిన వీధులు తదితరాలను సినిమాలో కొంత చూపించాలన్న ఉద్దేశంతో చిత్ర యూనిట్ నిమ్మకూరుకు వచ్చింది. ఎన్టీఆర్ చిన్నప్పటి విశేషాలకు గ్రామంలోని పెద్దలను అడిగి తెలుసుకుని, కొన్ని ఆసక్తికర అంశాలను క్రిష్ ఈ చిత్రంలో చేరుస్తారని సమాచారం. కాగా, తమ గ్రామానికి వచ్చిన చిత్ర టీమ్ కు అక్కడి ప్రజలు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి స్వాగతం పలికారు.