KTR: ఢిల్లీలో ఉన్న మోదీకి అర్థమయింది కానీ.. ఇక్కడి కాంగ్రెస్ నేతలకు మాత్రం అర్థం కాలేదు: కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి రూ. 8 వేలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని మంత్రి కేటీఆర్ అన్నారు. చరిత్రలో మరే ముఖ్యమంత్రి ఇలాంటి పనిని చేయలేకపోయారని చెప్పారు. శ్రీరామ రాజ్యంలో కూడా భూమి శిస్తును కట్టారని... కానీ, కేసీఆర్ పాలనలో రైతుకే డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. బీసీ గురుకుల పాఠశాలలను మరింత పెంచుతామని తెలిపారు. సిరిసిల్ల రాజన్న జిల్లాలో కేటీఆర్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి పేదలకు ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వసతులను మెరుగు పరిచామని... ఇప్పుడు చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎంతో పరిణతితో పని చేస్తున్నారంటూ ప్రధాని మోదీ కూడా కితాబిచ్చారని చెప్పారు. కేసీఆర్ గొప్పతనం ఢిల్లీలో ఉండే ప్రధానికి అర్థమయింది కానీ... ఇక్కడే ఉండే కాంగ్రెస్ నేతలకు మాత్రం అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
KTR
KCR
modi

More Telugu News