Saina Nehwal: ఎంపీ కవిత చాలెంజ్ ను స్వీకరించిన సైనా నెహ్వాల్.. మరికొందరికి సవాల్!

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత హరితహారం చాలెంజ్‌ను స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్వీకరించింది. తన నివాసంలో మొక్కలు నాటి మరికొందరికి సవాలు విసిరింది. ఈ సందర్భంగా సైనా ట్వీట్ చేస్తూ హరితహారం చాలెంజ్‌కు తనను నామినేట్ చేసినందుకు కవితకు థ్యాంక్స్ చెప్పింది.

తన వంతుగా మహిళా నటులు తాప్సీ, శ్రద్ధాకపూర్, ఇషా గుప్తాలను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్టు తెలిపింది. అందరం కలిసి పుడమి తల్లిని పచ్చగా మారుద్దామని పేర్కొంది. తొలుత ఈ చాలెంజ్‌కు 'హరితహారం' ఓఎస్డీ ప్రియాంక వర్గీస్.. ఎంపీ కవితను నామినేట్ చేసింది. స్వీకరించిన కవిత మొక్కలు నాటి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, సినీ దర్శకుడు రాజమౌళి, సైనా నెహ్వాల్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీని నామినేట్ చేసింది. వీరిలో తొలుత స్పందించిన సైనా మొక్కలు నాటి మరికొందరిని నామినేట్ చేసింది.
Go Back to Shorts
Saina Nehwal
K Kavitha
Thapsi
Actress

More Telugu News