వైద్య చరిత్రలోనే అద్భుతం.. పావుకిలో బరువుతో పుట్టిన శిశువు..బతికించిన వైద్యులు!
- ఫిబ్రవరిలో జన్మించిన బిడ్డ
- నాలుగు వారాల ముందే డెలివరీ
- ప్రస్తుతం 2 కిలోలకు చేరుకున్న బరువు
చెర్రీ (నవజాత శిశువు) తల్లి నికితది చత్తీస్‌గఢ్. చెర్రీ పుట్టడానికి ముందు నాలుగు సార్లు గర్భ స్రావమైంది. ఐదోసారికి విజయవంతమైంది. చెర్రీ కేసు చాలా క్లిష్టతరమైనదని వైద్యులు పేర్కొన్నారు. చిన్నారి పుట్టుకతోనే సమస్యలు చుట్టుముట్టాయన్నారు. పచ్చకామెర్లు, ఆహారం తీసుకోవడంలో సమస్య, కాలేయ సమస్యలు వేధించాయని తెలిపారు. తాము ఈ కేసును సవాలుగా తీసుకున్నామని రెయిన్‌బో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బేబీ పుట్టిన తర్వాత మూడు నాలుగు రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నామని వివరించారు. బ్రెయిన్‌లో బ్లీడింగ్ కాకపోవడంతో చిన్నారిని రక్షించడం సులభమైందన్నారు. బేబీ బతకడం వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన అని పేర్కొన్నారు.