షియోమీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షియోమీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల!

  • షియోమీ నుంచి ఎంఐ మ్యాక్స్‌3 విడుదల
  • ఎంఐ మ్యాక్స్‌ సిరీస్ లో రెండో మోడల్
  • భారీ స్క్రీన్ డిస్‌ప్లే, బ్యాటరీ బ్యాకప్
మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ మ్యాక్స్‌3 ని తాజాగా చైనాలో విడుదల చేసింది. షియోమీ తన ఎంఐ మ్యాక్స్‌ సిరీస్ లో మొదటిసారి ఎంఐ మ్యాక్స్‌2 ని విడుదల చేసింది. 14 నెలల అనంతరం భారీ స్క్రీన్ డిస్‌ప్లే, బ్యాటరీ బ్యాకప్ లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్లతో తాజాగా ఎంఐ మ్యాక్స్‌3 ని విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.17,320 ఉండగా.. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,375గా ఉంది.

ఎంఐ మ్యాక్స్‌ 3 ఫీచర్లు:

  • 6.9" ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
  • 5500ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 2160 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
  • ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ప్రాసెసర్‌
  • 4/6జీబీ ర్యామ్, 64/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 12/5 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా (ఎల్ఈడీ ఫ్లాష్‌)
  • ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌
Xiaomi Mi Max 3
smartphone
Tech-News
China
India

More Telugu News