Actress Sanjana: ప్రేమలో పడ్డమాట నిజమేనట... నటి సంజన రియల్ లవ్ స్టోరీ!

షార్ట్స్‌లో చూడండి
అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై రాణిస్తున్న నటి సంజన లవ్ లో పడిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. 'బాహుబలి' నిర్మాతలు రూపొందిస్తున్న టీవీ సీరియల్ 'స్వర్ణఖడ్గం'లో కీలకపాత్రను దక్కించుకున్న ఈ అందాల భామ, తాజా ఇంటర్వ్యూలో తన ప్రేమ కథను చెప్పింది.

 "ఆయన ఓ వైద్యుడు. ఓ ఆసుపత్రి చేపట్టిన హెల్త్ క్యాంపుకు నేను వెళ్లిన సమయంలో ఆయన పరిచయం అయ్యారు. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాను. మాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. ఈ విషయం మా ఇంట్లోని వారికి కూడా తెలుసు. ఇప్పటికింకా ప్రేమలోనే ఉన్నానుగా. మరిన్ని వివరాలు మాత్రం అడగవద్దు. ఇప్పుడప్పుడే చెప్పేది లేదు. కొంతకాలం రహస్యంగా ఉంచుతా. ఇక పెళ్లికి చాలా సమయం ఉంది" అని వెల్లడించింది. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తరువాతనే వివాహం చేసుకుందామని కాబోయే భర్తకు స్పష్టంగా చెప్పానని, దానికి ఆయన ఒప్పుకున్నారని చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
Actress Sanjana
Love

More Telugu News