భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ రచయిత రవి శంకర్ అలోక్!

  • 'అబ్ తక్ చప్పన్'కు రచయితగా పనిచేసిన రవి
  • గత ఏడాదిగా అవకాశాలు రాక ఒత్తిడి
  • గత రాత్రి రూఫ్ టాప్ పై నుంచి దూకి ఆత్మహత్య
నానా పటేకర్ నటించిన 'అబ్ తక్ చప్పన్' వంటి చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన రవి శంకర్ అలోక్ (32) ముంబైలోని ఓ బహుళ అంతస్తుల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రవిశంకర్ పశ్చిమ అంధేరీలోని సెవన్ బంగ్లాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

బుధవారం రాత్రి 2 గంటల సమయంలో తన భవంతి పై అంతస్తుకు చేరుకున్న ఆయన, అక్కడి నుంచి దూకాడు. అతని వద్ద, అతని ఇంట్లో ఏ విధమైన సూసైడ్ నోట్ దొరకలేదు. ఆయన ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, సైకియాట్రిక్ చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సుబ్రుబాన్ వెర్సోవా పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, గడచిన ఏడాది కాలంగా అతనికి బాలీవుడ్ లో అవకాశాలు రాలేదని తెలుస్తోంది.
Go Back to Shorts
Ravi Shankar Alok
Ab Tak Chappan
Sucide
Mumbai

More Telugu News