సావిత్రిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు కీర్తి సురేశ్?
- బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా 'ఎన్టీఆర్'
- సావిత్రి పాత్రకు కీర్తి సురేశ్ ఎంపిక
- ఎన్టీఆర్, సావిత్రి కాంబోలో పలు హిట్ చిత్రాలు
మహానటుడు దివంగత ఎన్టీ రామారావు జీవితకథగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' చిత్రంలో కీర్తి సురేశ్ మళ్లీ సావిత్రి పాత్రను పోషించనుందని అంటున్నారు. ఎన్టీఆర్ తో కలసి సావిత్రి పలు హిట్ చిత్రాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అందుకే, ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రస్తావన కూడా వస్తుందట. ఆయా సందర్భాలలో కనిపించే సావిత్రి పాత్ర కోసం కీర్తిని అడిగినట్టు, ఆమె వెంటనే అంగీకరించినట్టు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సంగతి విదితమే.