రాజమౌళి మల్టీ స్టారర్ మూవీలో కీర్తి సురేశ్?
- రాజమౌళి మల్టీ స్టారర్ కి సన్నాహాలు
- హీరోలుగా ఎన్టీఆర్ .. చరణ్
- కథానాయికల విషయంలో పెరుగుతోన్న ఆసక్తి
ఒక కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడనేది తాజా సమాచారం. 'మహానటి' చూసిన రాజమౌళి .. కీర్తి సురేశ్ నటనను ప్రశంసించిన సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ ను తీసుకోవడమే జరిగితే .. ఎవరి జోడీగా అనేది కూడా ఆసక్తిని రేకెత్తించే విషయమే. ఇటు ఎన్టీఆర్ తో జోడీకట్టినా .. అటు చరణ్ సరసన కనిపించినా ఫ్రెష్ కాంబినేషన్ కావడం విశేషం. భారీ అంచనాలున్న ఈ సినిమాలో రెండవ కథానాయిక ఎవరనే విషయమూ కుతూహలాన్ని కలిగించేదే!