వైఎస్ బయోపిక్ గా 'యాత్ర' .. రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైఎస్ బయోపిక్ గా 'యాత్ర' .. రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్

  • సెట్స్ పైకి రాజశేఖర్ రెడ్డి బయోపిక్
  • ప్రధాన పాత్రలో మమ్ముట్టి
  • దర్శకుడిగా మహి వి.రాఘవ్    
దర్శకుడిగా 'ఆనందో బ్రహ్మ' సినిమా సక్సెస్ తో తన సత్తా చాటుకున్న మహి వి.రాఘవ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను రూపొందించనున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రకి గాను ఇప్పటికే మమ్ముట్టిని ఎంపిక చేసి .. 'యాత్ర' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసి ఫస్టు పోస్టర్ ను కూడా వదిలారు. అప్పటి నుంచి కూడా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 20వ తేదీనుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. రేపటి నుంచి సెప్టెంబర్ వరకూ ఏకధాటిగా జరిగే సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగు పార్టును ముగించనున్నారు. ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం ఆయా సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్రలో 'బాహుబలి' ఫేమ్ ఆశ్రిత వేముగంటి .. సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవమెంతన్నది చూడాలి మరి.      
mammootty

More Telugu News