Mahesh Babu: డెహ్రాడూన్ లో మహేశ్ .. షూటింగ్ మొదలు

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. చాలా రోజులుగా ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతూ వచ్చాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో ప్లాన్ చేసినట్టుగా కొన్ని రోజులక్రితమే చెప్పారు. ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్కడ మొదలైపోయింది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.

 మహేశ్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించనుండగా, ఆయన సరసన కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. దిల్ రాజు .. అశ్వనీదత్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. ఇప్పటికే 'ఎన్టీఆర్' బయోపిక్ తో బాలకృష్ణ .. బోయపాటి సినిమాతో చరణ్ సంక్రాంతి బరిలో దిగడం ఖాయమైపోయింది. అదే సమయానికి మహేశ్ బాబు సినిమా కూడా రంగంలోకి దిగుతుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది.  

Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News