news reader: విజయవాడకు చెందిన మాజీ యాంకర్ తేజస్విని ఆత్మహత్య

  • విజయవాడ శివార్లలోని ఈడుపుగల్లులో ఘటన
  • నిన్న రాత్రి అత్తతో గొడవపడ్డ తేజస్విని
  • ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య
విజయవాడలో దారుణం సంభవించింది. గతంలో ఓ ఛానల్ లో యాంకర్ గా పని చేసిన తేజస్విని నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే, విజయవాడ శివార్లలో ఉన్న ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో గత కొంతకాలంగా తేజస్విని, ఆమె భర్త పవన్ కుమార్ ఉంటున్నారు. తేజస్విని గతంలో ఓ ఛానల్ లో యాంకర్ గా పని చేసింది. పవన్ కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. నిన్న రాత్రి అత్త అన్నపూర్ణాదేవితో తేజస్విని గొడవ పడింది.

అనంతరం గదిలోకి వెళ్లి, ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకూ తేజస్విని రాకపోవడంతో... అనుమానం వచ్చిన అత్త గదిలోకి వెళ్లి, చూసింది. ఫ్యాన్ కు వేలాడుతూ తేజస్విని కనిపించడంతో... వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
news reader
tejaswini
suicide
vijayawada

More Telugu News