పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తానంటోన్న హీరోయిన్
- భీమనేని దర్శకత్వంలో 'సిల్లీ ఫెలోస్'
- హీరోలుగా అల్లరి నరేశ్ .. సునీల్
- కథానాయికగా చిత్రా శుక్లా
ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న 'చిత్రా శుక్లా' మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. ఈ తరహా పాత్రను పోషించడం నాకు ఇదే మొదటిసారి. అందువలన గతంలో రేఖ .. టబు పోలీస్ ఆఫీసర్స్ గా చేసిన సినిమాలు చూశాను. ఆ రిఫరెన్స్ నాకు బాగా ఉపయోగపడుతోంది. కామెడీని పండించడంలో అల్లరి నరేశ్ .. సునీల్ శైలి చాలా భిన్నంగా అనిపిస్తోంది .. నటన పరంగా కొత్త విషయాలను నేర్చుకోవడానికి నాకు మంచి అవకాశం లభించింది" అని చెప్పుకొచ్చింది.