కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారు.. జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ బాధ్యతలను అప్పగించాలి: మోత్కుపల్లి డిమాండ్
- ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం
- ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడాలి
- ఎన్టీఆర్ కోసం కేసీఆర్ ఓ స్థూపాన్ని ఏర్పాటు చేయాలి
జూనియర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా కూర్చొని మాట్లాడాలని... తామంతా ఏపీకి వచ్చి ప్రచారం చేస్తామని చెప్పారు. కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు కూడా తాను ఒక విన్నపం చేస్తున్నానని... ఎన్టీఆర్ కోసం ఒక స్థూపం ఏర్పాటు చేయాలని మోత్కుపల్లి కోరారు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ శిష్యుడేనని చెప్పారు. తెలంగాణలోని కీలక నేతలందరినీ ఎన్టీఆరే తయారు చేశారని అన్నారు.