రెగ్యులర్ షూటింగుకి సిద్ధమైన వై.ఎస్.ఆర్. బయోపిక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెగ్యులర్ షూటింగుకి సిద్ధమైన వై.ఎస్.ఆర్. బయోపిక్

  • వై.ఎస్.ఆర్. బయోపిక్ గా 'యాత్ర'
  • ప్రధానమైన పాత్రలో మమ్ముట్టి 
  • వచ్చేనెల 18 నుంచి రెగ్యులర్ షూటింగ్   
ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు జరుగుతూ ఉంటే .. మరో వైపున వై.ఎస్.ఆర్. బయోపిక్ కి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో వై.ఎస్.ఆర్. బయోపిక్ 'యాత్ర' పేరుతో రూపొందనుంది. వై.ఎస్.ఆర్. పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది.

రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నారనే వార్త బయటికి రాగానే ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగింది. ఇక విజయమ్మ .. జగన్ .. షర్మిళ .. భారతి పాత్రల కోసం నటీనటుల అన్వేషణ కొనసాగుతోంది. షర్మిళ పాత్రలో భూమిక నటించనుందంటూ వచ్చిన వార్తలో ఎంతమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వచ్చేనెల 18వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2019 ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.       
mammootty

More Telugu News