Mahesh Babu: 25వ మూవీలో మీసకట్టుతో కనిపించనున్న మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
'భరత్ అనే నేను' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహేశ్ బాబు, తన తదుపరి సినిమాను వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 'భరత్ అనే నేను' సినిమా ప్రమోషన్స్ సమయంలో .. నెక్స్ట్ మూవీలో తాను కొత్త లుక్ తో కనిపించనున్నట్టు చెప్పాడు. మొదటి నుంచి కూడా మహేశ్ బాబు లుక్స్ విషయంలో చిన్న చిన్న మార్పులు తప్ప .. పెద్దగా మార్పు చూపించడానికి ఆసక్తిని చూపడు.

 అందువలన ఆయన లుక్ ఎలా వుండనుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఆయన ఈ సినిమాలో 'మీస కట్టు'తో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. 'భరత్ అనే నేను'లో ఒక పాటలో .. ఒక బిట్ లో ఆయన మీసా కట్టుతో కనిపిస్తేనే ఆడియన్స్ సందడి చేసేశారు. అలాంటిది ఆయన ఈ సినిమాలో మీసకట్టుతోనే కనిపించనున్నాడని అంటున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.  
Go Back to Shorts
Mahesh Babu
pooja hegde

More Telugu News